బహుముఖ ప్రజ్ఞాసాలి మొదలి శర్మ గారు
అతిశయమనిపించవచ్చు నేమోగాని, నాగభూషణ శర్మ గారి గురించి తెలుగు నాట నాటక ప్రియులకు, సాహిత్యకారులకు, కళాపిపాసులకు, ప్రత్యేకించి పరిచయం చేయడం, లేదా రాయటం అవసరమా?
ఈ కొద్ది మాటలు శర్మగారికి నేనర్పించుకొంటున్న కృతజ్ఞతాంజలులు
“తెలుగు సాహిత్యం – గాంధీజీ ప్రభావం” వారి రచనల్లో నేను చదివిన మొదటి గ్రంధం, మహాత్ముడి పై నాకున్న గౌరవ ప్రతిపత్తులు, ఆయన భావజాలం పై ఆసక్తి వల్ల. ఆ తరువాతనే మిగత పుస్తకాలు, “కన్యాశుల్కం – నూరేళ్ళ సమాలోచనం”, మిత్రుడు ఏటికూరి ప్రసాదు తో కలసి సంపాదికరించిన అత్యుత్తమ్మ గ్రంధం. గురజాడ పై సర్వసం.
ఆంగ్లంలో వచ్చిన గ్రంధాలల్లో “The Performing Arts of Andhra Pradesh”, కళాభిమానులు సొంతంగా ఉంచుకోవలసిన “Reference” గ్రంధం. అదొక విషయ సంపన్న గని! అదే క్రమంలో, “Kuchipudi : Gurus, Performers and Performance Traditions” కూడా.
ఇక, తెలుగువారి కళా సంపదను విశేష కృషి సల్పిన “నాట్యకళ” (శ్రీనివాస చక్రవర్తి) ఆగిపో యాక, అంతకంటే ఉన్నతస్తాయిలో, చక్కటి ప్రమణాలతో వెలువడ్డ “Nartanam”, (కీ.శే. జి.ఎన్.శర్మ గారి చొరవ) త్రైమాస పత్రికకు దాదాపు 10 సంవత్సరాలకు పైగా సంపాదకత్వం వహించి, ప్రత్యేక సంచికలు, అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే విధంగా వెలువరించారు, నాటక ప్రయొక్తగా కొత్త పుంతలు తొక్కారు. “ప్రజా నాయకుడు ప్రకాశం”, “కాగితం పులి” వీటిలో కొన్ని మాత్రమే! ఇలా చెప్పుకుంటూపొతే మరిఎన్నెనో కితాబులు ఆయిన పద్దులో జమపరచాలో !!!
మరొక విషయం, ఈ సంధర్భం లో – “తెలుగు వారి చరిత్ర – సంస్కృతి” (క్రి.పూ. 5000 – క్రి.శ.2000) సమగ్ర సంపుటాలు ప్రచురించాక, భావి చరిత్ర కారులకు ఉపకరించేలా ఒక బృహుత్తర సంపుటాన్ని (Source Volume) ప్రచురిస్తున్నపుడు, ఒక అధ్యాయం, లలిత కళల పై – సంగీతం, నాట్యం,నాటకం, చిత్రలేఖనం పై శర్మగారు రాసిన పరిచయ వ్యాసం సంగ్రమమైనది, అందరు చదవదగ్గదీను!!
మా వ్యక్తిగత స్నేహ సుహృత్భావాలు, వీటన్నిటికంటే ఒక మెట్టు పైన ఉందనటం మా అదృష్టం !!!
వకుళాభరణం రామకృష్ణ
హైదరాబాదు