రంగస్థల సేనాధిపతి
మహానది ప్రవహిస్తూ ఉంటే చూస్తు ఆశ్చర్య పడటం తప్ప ఏమి చెయలేం, అలాగే, ఆచార్య మొదలి నాగభూషణ శర్మ ప్రదర్శన, రంగస్థలి ప్రయాణ విశేష యాత్ర కూడా విఙులను సహితం అబ్బురపరుస్తుంది. ఆ నది లాగే సాధారణ మూలలతో ఆరంభం అయ్యి పారుతున్న కొద్ది, విశాలమై, వేగం పెంచుకొని అన్ని సంస్కా రా లను, భిన్న సంస్కృతులను తాకుతూ, పలకరిస్తూ, ఆగి, తానే పరవసించి, చూ సేవారికి ఒక తన్మయ బేధం సాక్షాత్కరింప చేసి సాగిపొతున్న నది ఆయన. యోగి లాంటి తాపసి. తపసిద్ధి కొసం పుట్టిన యోగి. నిరంతర కర్మాచరణ ఆయనకి పట్టిన అదృష్టం. అనితర సాధ్యమైన అవగాహన పటిమ ఆయన కవచం. సాంప్రదా యాన్ని ఆధునికతని ఈదగల బాహుబలం అయినది. మూలాలని, మూలలు సాధించిన మూల్యలని, ఇప్పు డు చెల్లించవలసిన మూల్యాలనీ – నాటక రంగంలో – ఎంత దూరదృష్టితో సాధించవలసి ఉన్నదో ఆయన తన 20వ ఏటనే అర్థం చేసుకోగలిగారు. ఆంగ్లంలో మేలు రకం ఉపన్యాసక వర్గంలో స్థిరపడినా అమెరికా వెళ్ళి దర్శకత్వంలో విద్యనభ్యసించారు. అమెరికన్ రంగ స్థలం పై ఊస్మానియ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పొందారు. తరువాత ఆయన చూపిన ప్రభావం- చేసినపని ఆయనకు ముందుగల ఏ రంగస్థల కోవిదులకి సాధ్యం కాలేదు. సమకాలీన భారతీయ రంగస్థలంలో వస్తున్న మార్పులని, మన కూచిపూడి నృత్యాల మేలు బంతినీ, భారతీయ నృత్య రీతుల ప్రదర్శనల మాలిని తరచి తరచి చూసారు. తెలుగు నాటకరంగ, నాటిక విమర్శా పరిమితుల్ని, పూర్వ, ఆధునిక తేజాల్ని, ఉత్తేజాల్ని, అవపోసన పట్టి, కొత్తరుక్కుల వంటి గ్రంధాల్ని వెల ఇంచారు.రఘురామయ్య, బళ్ళారి, స్థానం లాంటి నటుల గురించి; చిలకమర్తి, రాజమన్నారూ, ఆత్రేయ వంటి రచయితల గురించి, సూరి శాస్త్రి గారి వంటి విమర్శకుల గురించి, ఆయన తట్టి చూడని వారు లేరు. తూర్పు భాగవతాలు, భాగవత మేళా మెళ్ళటూరులు, తోలుబొమ్మలాటలు, జానపదుల ప్రదర్శన, కళారూపాలు – వీటిలో వ్యక్తమైన, మార్పు చెందుతున్న విషయ నిరూపణ, వైవిద్య ప్రకటన – ఆయన చర్చించని రంగస్థల రూపం లేదు, నిర్మితి లేదు. ఎందుచెత? ఆధునిక సాంఘిక నాటకం అంటే, సంభాషణల బంతులాట కాదని తెలుగు నాట విలసిల్లిన అనేక రూపల సారాంశాలను, అమృత కలసంలో పొసిన ప్రాణాధారలను ఘటనా కల్పనలో, సంవిదాన రచనలో, ప్రదర్శన చాతుర్యంలో ఎంచుకొని, జల్లుకొని, నాలుగు కాలాలపాటు గర్వంగా నిలబటమేనని, శర్మగారు, ఇంతగా పాటుబడ్డారు. కొద్దిమందైనా ప్రఙ గల ఆలోచనా బంధువులతో శ్రమించారు, ఫలితాలను విద్యార్ధులద్వారా అందించారు.
ఈ కృషి గొప్పమార్పు తెచ్చినదా అంటే సమాధానం కష్టమే, కాని ఎప్పుడు మన ఔత్సాహిక నాటక రంగంలో, ప్రదర్సనరణ రీతిలో మార్పు తెస్తారో కాలమే సమాధానం చెప్పాలి.
ప్రయోగమంటే మామూలు మాట కాదని, బుధ్ధితోనూ, దర్శకప్రతిభతోనూ ముడిపడి ఉందని, అంధయుగ్ అనువాదం చేసి తెలుగులో ప్రదర్శించారు. సంఘర్షణ అంటే జమీందారీ – రైతువర్గ పొరాటం మాత్రమేకాదని, మానసికభౌతి విశ్లేషణల మధ్య అంతర్యుధ్ధము కూడ సంఘర్షణ అయి, నాటకవస్తు బలం విశ్వరూపం అవుతుందని హయవదన అనువాదం ప్రదర్సించి సూచించారు. లౌకిక ప్రపంచంలో మేరు సమానధీరులైన ధీరుడు ప్రజానాయకుడు ఎదుర్కొన్న శరాఘాతాలను ఘటనాశకలాలుగా చూపుతూ జీవిత చరిత్రను ఎలా రక్తిమయ దృశ్యకావ్యంగా చూపవచ్చునో ప్రకాశం పంతులు గారి కధను నాటకంగా ప్రదర్శించారు. బెకెట్ నాటకం వైటింగ్ ఫర్ గోడొ విద్యార్ధుల చేత ప్రదర్సించాలని సిద్దం చెసారు. ఆ ఘటనా సార్ధక్యానికి ఆ నాటకం ప్రపంచాన్ని కుదిపిన నాటకం అది.
మమ్మల్ని కుదుపే నాటకం ఎక్కడనుంచి వస్తుంది, కూచిపూడి ‘జడారూపకం‘లోంచి వస్తుంది. అదొక మెటాఫర్ : నంద–యశోదల హృదయాలు ఎక్కడ కలుస్తాయి. విప్పారిన నాట్య–సంవాద ముగింపులో కలుస్తాయి. భ్రమవిచ్చిత్తి ఎక్కడ దొరుకుంది? హాస్య స్ఫురణ ఎక్కడనుంచి మెరుస్తుంది? తోలుబొమ్మలాటలలో, భాగవతుల కధా గానంలో సాధ్యం అవుతుంది. సంభాషణా పటిమ–కాగల సంఘటనల సూచనలు సాగిస్తూ, భావభందురంగా ఎలా సాగిచవచ్చు? సంస్కృత నాటకాలలో, గ్రీకు నాటకాలలో ఎన్నో పార్టులు ఉన్నా యి ‘సంపూర్ణా నాటకంగా, పాట, ఆట, మైం, ఆంగిక భాష ప్రయోగిస్తూ, కాగితంపులి (శంకర్ శేష్ హిందీ మూలం)అందుకే ప్రదర్శించారు.
శర్మగారు చేసిన అనువాదలలో, ప్రదర్శనలలో,అగ్రభాగాన నిలిచేవి – రాజ ఈడిపస్ క్రీ.పూ. 496 నుండి 406 వరకు జీవించిన సొఫొక్లిస్ రాసిన ఈ గ్రీకు నాటకం ఉస్మానీయ విశ్వవిద్యాలయం నాటక విభాగ విద్యార్ధులచే, శర్మగారు ప్రదర్శింపచెయటం, ఆయన అపార అంకిత భావానికి సూచిక. ఇందులో ఆయన ప్రకటించిన, గ్రీకు నాటక రచన, ప్రదర్శన విశేషాలు – వివరణలు, చదివితే, మరొక తెలుగు రచయిత నాటకం రాయడానికి సాహసించడు. పాత్రల వెనుక, ప్రదర్శన రీత్యా ఇంత నేపధ్య ఉంటుందా అని రచయిత ఏ రచనకూ పూనుకొనడు.
అంతటి జా జాగృతితో విద్యార్ధులు శర్మగారి శిష్యరికం నుండి పాఠాలు నెర్చుకొన్న అదృష్టవంతులు. ఐ ఐ టి లలో చదువుకొనే ఇంజనీరింగ్ విద్యార్ధులు తయరైనట్లు, శర్మగారు నాటక విభాగ విద్యార్ధులను తీర్చిదిద్దారు. అంతటి చదువునేర్చిన దేసికులు వారు. గురువు అర్ధం లోనూ, యాత్రికునిగాను, దేససికులు. అనువాదంలో చిక్కటి దేసిత్వం ఆయనది, ప్రాంతీయ సృజనార్ధంలో శైలి అర్ధంలోనూ, దేసిత్వం ఆయనది.
ఆయన 20వ ఏటనే, ఆకాశవాణికి, కళాసాల విద్యార్ధులకు, నడిపే రేడియో నాటక రచనలలో తొలిసారి ‘కల–కాపురం‘ శ్రవ్య నాటికను (1954-55 లో) బహుమతి పొందారు అని ఇంత రాసిన తరువాత చెప్పటం సరికాదు. 1974లోనే ఆయన స్వతంత్రంగా నాటకాలు రాయడం మానుకొన్నారు. ప్రతిభకు వయసు ఏమిటి? 30 నాటకలలో నటించి, 60 నాటకాలకు దర్శకత్వం వహించిన తరువాత. ఐనా ఆయన, రచనా శక్తి రెండు పదులు దాటీ దాటని విద్యార్ధి దశలోనె శక్తి ఇది :
కమల : …. జీవితాన్ని గురించి ఎన్నికలలు కన్నాను. తీరా ఎక్కడం, వెంటనే పడటం తెలుసుకున్న తర్వాతగాని, నేను ఎక్కింది ములగ చెట్టని తెలుసుకో లేకపొయాను. ఇప్పుడు మళ్ళీ చెట్టు ఎక్కడం నేర్చు కోవాలంటే మాటలా?
శర్మగారిలా, పరిషత్తు ప్రదర్శన నాటకాలకు ఇలా సంభాషణలు రాసే రచయిత ఎక్కువ రచనలు చేయకపొవటం ఒకరకంగా నష్టమే గాని అలా ఆయన రచయిత గానే ఉండిపొతే వందలాది వ్యాసాలు రాస్తూ ‘దక్షిణ భారత రంగస్థలి సాంప్రదాయాలు ‘(1990) అంటూ జాతీయ నాటక సంస్థకు ఉపన్యాసము చేయగల పరిశోధకుడు దక్కేవాడు కాదు. పురాణం సూరిశాస్త్రి గారి నాట్యాంభుజం విశేషాల మీద, శ్రీపాద గోపాల కృష్ణ మూర్తిగారి ఏకాంకికల మీద, కన్యాశుల్కం వంద సంవత్సరాల సమీక్షల మీద, వందలకొద్ది నాటక వ్యాసాలు వచ్చి ఉండేవి కావు. ధర్మవరం వారి నాటకాలు మళ్ళీ వెలుగు చూసి ఉండేవి కావు.
శర్మగారితో యధాలాపం కబుర్లు చెప్పినా, గంభీరంగా కుర్చొని మాట్లాడినా, నేలమీద నడిచే ఒక ఉత్తమ పరిశోధకుడు గొంతు విప్పుతూనే ఉంటాడు. ‘బారిష్టర్ పార్వతీశానికి ముందు ఒక నవల ప్రచురించారు. చింతామణిలో అచ్చైయిందేమో!’అంటారు. పానుగంటి కంటే ముందు ఆలాటి గొంతుతోనే బుధ్ధిరాజు ఈశ్వరప్ప పంతులుగారు 1908 లోనే పర్లాకిమడి నుంచి హాస్యం రాసేవారండి!’అని గొప్పగా ప్రస్తావించాను. ‘అవును ఆయన అప్పట్లోనే సినిమా స్లైడుల్లా బొమ్మలు చూపిస్తూ తిరుగుతూ ఉండేవారు. మంచి వ్యంగ్య ప్రక్రియ రాసేవాడు ‘ అంటారు.
గంభీరంగా ప్రశ్నిస్తే అలవోకగా రత్నాలవంటి సమాధానాలిస్తారు. శర్మగారి మాటల్లోనే : ‘కధని స్తైలైజ్డ్ గా (శిల్పంతో ప్రదర్శించాలంటే) చూపాలంటే సంస్కృత నాటకాలకు వెళ్ళాల్సినదే‘.
“ఆంగ్ల నాటక కాలం నుండి మనం నేర్చుకోవలసిన వాటికంటే, నేర్చుకోకూడనివి ఉన్నయి“. “మన నాట ఇతర సంగీతపు వరసలని పద్యనాటకాలలో అనుసరించారు. హరిప్రసాదరావు, యడవల్లి కొంచెం అడాప్టు చేసుకొన్నారు. మనం సంగీతాన్ని నాటకానికి అనుసంధానం చేసుకోలేక పోయాం. సంగీతంలో అంతర్గతంగా ఉండే జీవనాడిని పట్టుకోలేకపోయాం!
పెద్ద ఆఫీసరుగా పని చేసిన బుర్రా సుబ్రహ్మణ్యం గారు ‘నన్నిలా బ్రతకనీయండి” అని స్త్రీల పక్షాన ఒక నాటకం రాసారు, ప్రచురించారు, కాని బైటకు రాలేదు. “ఇబ్సెన్ రాసిన ఎనిమీ ఆఫ్ ది పీపుల్“, ని అనుసరించి రాయవలసినదే, నిజంగా అనుసరించి రాయలేదు .
“మృచకటికం ఇంగ్లీషులో వేసాం. ఎక్బొటే, మైత్రేయి వేషం వేసాడు” ఇంగ్లీషు నాటకాలకి ఇక్కడ చూసేవారు తక్కువ“
“మన పద్య నాటకాన్ని తిరిగి బ్రతికిద్దామని ప్రయత్నం చేసినా విఫలమైయింది. భాషతెలిసిన హార్మోనిస్ట్ లేదు“,
“పరిమిత వనరులతో ఔత్సాహిక నాటక రంగం కృషివలన సాంఘీక నాటకం మినుక్కు మినుక్కు మని నడుస్తోంది“.
“నాటకాల్ని సాహిత్యనికి దూరం చేసారు. ఎప్పుడు నాటకం, సాహిత్యంలో భాగంగా వస్తుందో, అప్పుడే నిలబడుతుంది.”
“అబ్బూరి రామకృష్ణారావు గారు కనాశుల్కం, మృచ్చకటికం చేసారు. మేము హైదరాబాదులో ప్రయోగాత్మకాలు చేసాము. జానపద కళా రూపాలు పెట్టము. ఎక్స్ప్రెషనిస్టిక్ నాటకం తెచ్చాం. బ్రెక్ట్ – “మైం” తేవడానికి భయపడ్డాం. బ్రెక్ట్ ది – చాక్ సిర్కిల్ – సగం నాటిక మూడున్నర గంటలు ప్రదర్శించాం. మూడు లక్షలు ఖర్చు చేసాం. కె. వి.గోపాలస్వామి మంచి నాటకాలే వెయించారు. నాలుగు చోట్ల తిప్పలేకపొయారు. మన విద్యార్ధులకు ఇతర ప్రాంతపు నాటకాలు చూసే అవకాశం లేదు“.
“ఆధునిక వృత్తి రంగస్థల దృష్టి మనకు లేదు. కన్నడం నుంచి నేర్చుకోలేదు. ప్రైవెటు సంస్థలు మలయాళం వాళ్ళకి సహాయపడతారు. కలకత్తాలో వామపక్ష ప్రభుత్వం ఉన్నకాలం లో, రంగస్థలం వారిని అనుసరించింది. కాని మనవారు మధ్య తరగతి ప్రజలు. ఆంధ్ర సమాజం సాంప్రదాయక అభిరుచులు కలది. మా భూమి నాటకం తెలంగాణకు నప్పే కధ. ఇక్కడ మనకు – కూలి రాజు, పాలేరు, నాటకాలతో ఒక మలుపు రావలసింది, రాలేదు, దర్శకుడు, నటులు – మనకి అందరూ మధ్యతరగతి వారే“.
నాటకం సమస్య మీద ఆధారపడి సాగుతుంది. సమస్యని అధ్యయనం చేయాలి. అలా చేయకుండా రాస్తున్నారు నాటకం. ఆలోచనలను స్వాగతించే మనస్తత్వం కాదు మనది”
“చూసి అనందించే సంస్కారం ఉన్నవారు, రచయితలు, దర్శకులు కలసి ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ప్రాంతాలలోను శ్రీకాకుళం, మధ్య కోస్తా, రాయలసీమ, మూడు రిపర్టరీ బృందాలను జీతాలకు ఎర్పర్చుకోండి 25 లక్షల రూపాయలు పద్య నాటక బృందానికి, 25 లక్షల రూపాయలు సాంఘీక నాటకానికి నటులను తయారు చేయండి. ముందే నాటకం వివ్వకండి. 3 కోట్ల రూపాయలతో మూడు బృందాలు తయారవుతాయి“.
అది నాటక సమరం తెలిసిన సేనాధిపతి గారి అంతరంగం. నాగభూషణ శర్మగారు అలా 67 సంవత్సరాలుగా ఆయుధాలు పదును పెడుతూనే ఉన్నరు.
పన్నాల సుబ్రహ్మణ్య భట్టు